ఢిల్లీ పేల్లుల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు, సోమవారం రాత్రి ఆత్మకూరు బస్టాండ్లో ఆత్మకూరు సిఐ రాము నేతృత్వంలో సోదాలు నిర్వహించారు, బస్టాండ్ లోని ప్రయాణికుల వద్ద ఉన్న బ్లాగుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు,అలాగే బస్సులలో ఉన్న ప్రయాణికుల లగేజ్ లను అలాగే బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పట్టణంలో ఉన్న పనులు లాడ్జిలలో తనిఖీలు నిర్వహించారు,అలాగే లాడ్జిల్లో బస చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకుని వారిని తనిఖీలు చేశారు,పోలీసులు ఈ సందర్భంగా సిఐ రాము మాట్లాడుతూ, ఎవరైనా అనుమానిత వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనపడిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు,