కర్నూలు: విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలి:రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
విజయానికి విద్య కీలకమని, విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు నగరం లోని ఏ.క్యాంప్ లో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో మాంటిస్సోరి సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం లో గవర్నర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత స్వర్గీయ కళ్యాణమ్మ అంకిత భావంతో విద్యా రంగం అభివృద్ధి కి కృషి చేశారని, పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి వినూత్న బోధనా పద్ధతులను అమలు చేయడంలో మాంట