డోన్: అంబేద్కర్ ఆశయాలు ఆదర్శం :డోన్ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి
Dhone, Nandyal | Apr 14, 2026 భారతదేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డా.బీఆర్ అంబేడ్కర్ అని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల నాగరాజు, రూబెన్, సుబ్బారెడ్డి, నాగమోహన్ పాల్గొని అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు.