ధర్మవరం పట్టణంలో ఆరవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్.
ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మంగళవారం మధ్యాహ్నం నుండి కనిపించడం లేదని వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఒకే రోజు ఇద్దరు బాలికలు కనపడకపోవడంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని ప్రత్యేక సిబ్బందిని నియమించి గాలిస్తున్నారు.