తణుకు: నియోజకవర్గ సొసైటీలకు సంబంధించి సొసైటీ ప్రెసిడెంట్ లు, మెంబర్లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
సొసైటీలు అందించే సేవలు రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసే దిశగా త్రిసభ్య కమిటీలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకులోని కూటమి కార్యాలయంలో నియోజకవర్గ సొసైటీలకు సంబంధించి సొసైటీ ప్రెసిడెంట్ లు, మెంబర్లు అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఇప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు.