హత్నూర: నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, అజ్జమర్రి లో వనదుర్గా మాతాగా దర్శనం
నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలు గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం నరసాపూర్ నియోజకవర్గంలోని చిలిపి షెడ్ మండలం అజ్జమారి గ్రామంలో వనదుర్గమాతగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు భక్తులు పేర్కొన్నారు. కాగా దుర్గాభవాని అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భవాని మాలాదారులు భక్తులు పాల్గొన్నారు.