ఒంగోలు అర్బన్: పెల్లూరు సమీపంలో డివైడర్ ని ఢీ కొట్టి బోల్తాపడ్డ కారు, ఐదు మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 7, 2026
ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు వేగంగా డివైడర్ ని ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో మొత్తం ఐదు మంది గాయాల పాలయ్యారు. వారందరినీ 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కారుని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి మరో ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. క్షతగాత్రులందరూ లింగసముద్రం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.