కల్లూరు మండలం పందిపాడు గ్రామం నుంచి రైతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమానికి బయలుదేరారు. ఆంజనేయస్వామి గుడి దగ్గర నుండి గ్రామ వీధులలో తిరుగుతూ గోడల వీరాంజనేయ స్వామి దేవాలయానికి చేరారు. సభలో గుమ్మల పెద్ద పుల్లారెడ్డి, గూడూరు శేఖర్ చౌదరి, భీమేశ్వర్ రెడ్డి, గుమ్మల విజయ్ శేఖర్ రెడ్డి, బోయ రవి, బోయ శివ, లక్ష్మణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.