నంద్యాల అర్బన్: మహానంది మండలంలో అరటి తోటలో అగ్నిప్రమాదం
Nandyal Urban, Nandyal | May 24, 2026
నంద్యాల జిల్లామహానంది మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్కాకుల నారాయణ పొలంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. గాలుల బారి నుంచి అరటి చెట్లను కాపాడేందుకు చెట్ల వద్ద సపోర్ట్ గా కట్టుకోవడానికి తెచ్చుకున్న సుమారు 1000 కి పైగా కర్రలు కాలి బూడిదయ్యాయి. వీటితో పాటు డ్రిప్పు పరికరాలు సైతం అగ్నికి ఆహుతి కావడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.