డోన్: బేతంచెర్ల లో సీనియర్ సిఐటియు నాయకుడు కన్నుమూత
Dhone, Nandyal | Jun 8, 2026 నంద్యాల జిల్లాబేతంచర్ల సీఐటీయూ నాయకుడిగా 50 ఏళ్లు సేవలు అందించిన ఎస్.సాధిక్ హుస్సేన్ (71) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆయన మరణంపై టీడీపీ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, షేక్షావలి చౌదరి, వైసీపీ నాయకులు ముర్తుజావలి, ఖాజా హుస్సేన్, పారిశ్రామికవేత్త హుస్సేన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.