కడప: కడప విమానాశ్రయంలో "ఒక చెట్టు అమ్మ పేరుతో" మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు
Kadapa, YSR | Sep 17, 2025 కడప విమానాశ్రయంలో నిర్వహించిన "ఒక చెట్టు – అమ్మ పేరుతో" మొక్కలు నాటే కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని, మొక్కను నాటారు.యాత్రి సేవా దివస్‌ను పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ.. “పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పెంచి పచ్చదనాన్ని కాపాడాలి. పచ్చదనం కాపాడితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో కడప విమానాశ్రయ సిబ్బంది, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు.