పలమనేరు: గంగవరం: యువత స్పీడ్ తగ్గించండి, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు - సీఐ ప్రసాద్ రాజు
గంగవరం: పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రాజు తెలిపిన సమాచారం మేరకు. యువత వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు, దానివల్ల పలు సందర్భాల్లో కింద పడి కాళ్లు చేయిలు విరుచుకోవడం ఒక్కోసారి ప్రాణాలు పోవడం జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని నడపాలి, మీరు ప్రమాదానికి గురవడమే కాక ఎదుటివారిని సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి వారిని ప్రమాదంలోకి మీరే నెట్టి వేస్తున్నారు. పిల్లల ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేము కావున మైనర్లకు వాహనాలు ఇవ్వకండన్నారు.