డోన్: డోన్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 14, 2026 క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తిస్తే పూర్తిగా నియంత్రించేలా చికిత్స అందించవచ్చని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని క్లబ్ హౌస్ ప్రాంగణంలో ఎంపీ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు.