కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు పరీశీలన: ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్మాణంలో ఉన్న న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్‌లోని క్రిటికల్ కేర్ బ్లాక్ సివిల్ వర్క్ పురోగతిని ఏపీ ఎం ఎస్ ఐడీసీ సంబంధిత అధికారులు పరిశీలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని న్యూ డైయాగ్నస్టిక్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాకును ప సందర్శించారు. ఈ సందర్బంగా అధికార బృందం నిర్మాణ పనుల నాణ్యత, భవన నిర్మాణ దశలు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను సమీక్షించినట్లు తెలిపారు.