49 మంది లబ్ధిదారులకు 48.43 లక్షల సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జనార్ధన్
Ongole Urban, Prakasam | Apr 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి చెందిన 49 మంది లబ్ధిదారులకు సంబంధించిన 48.43 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల వైద్యానికి కట్టుబడి ఉందన్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలను అందించడమే కాకుండా అవి పొందలేని వారికి అర్హత కలిగిన వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటూ ఆర్థిక చేయూతనిస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు