అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాసా విద్యానికేతన్ క్రీడా ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని బెళుగుప్ప హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలపాడు శ్రీ గురు సేవానంద్ స్వాములు, ఆర్ ఎస్ ఎస్ విభాగ్ జిల్లా ప్రచారక్ లక్ష్మణ్ లు మహాసభ గౌరవ అధ్యక్షులు నారాయణరెడ్డి సభ అధ్యక్షులు కల్యకుర్తి ధనుంజయ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో తొలుతగా ర్యాలీ నిర్వహించిన అనంతరం మహాసభను నిర్వహించి హిందూ తత్వ భావాలను ప్రతిబింబించేలా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు ప్రసంగించారు.