ఒంగోలు అర్బన్: వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి గిట్టుబాటు ధరలను అడిగి తెలుసుకున్న జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లా వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధరలపై అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. గత ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. పొగాకు రైతులకు న్యాయం చేయాలని లేదంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారని బూచేపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.