కర్నూలు: ఈనెల 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ నెల 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనునట్లు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.ఉదయం 10 గంటలకి విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.