మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు హైదరాబాద్లోని NHM డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఈరోజు ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న పథకంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్గా పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులకు వరుసగా 3 నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. పక్క రాష్ట్రాల్లో రెగ్యులరైజేషన్ జీతాల పెంపు జరుగుతుండగా TGలో మాత్రం జీతాలే అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.