ఒంగోలు అర్బన్: ఒంగోల్ నగర కార్పొరేషన్ లో వంద మందిని పద్ధతిలో నియమించండి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 29, 2026
ఒంగోలులో పారిశుధ్య నిర్వహణ అత్యధిక ప్రాధాన్యత అంశమని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా అవసరమైన సిబ్బందిని భర్తీ చేసుకొని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బుధవారం ఒంగోలు కార్పొరేషన్ లో సంబంధిత అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యము, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన స్థాయిలో సిబ్బంది లేరని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు.