అన్నమ్మయ్య: 998.90 అడుగుల వద్ద నిలకడగా పించా నీటి స్థాయి – అధికారులు అప్రమత్తం
టి.సుండుపల్లి మండలంలోని పించా ప్రాజెక్టులో మంగళవారం నీటి మట్టం 998.90 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 0.30637 TMC (306.37 MCFT) నీరు నిల్వగా ఉందని అధికారులు తెలిపారు.ఇన్‌ఫ్లో 1257 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1248 క్యూసెక్కులుగా ఉంది. గేటు నం.1 మరియు నం.3 తలా 0.50 అడుగులు తెరిచి, నీటిని విడుదల చేస్తున్నట్లు ఎఈఈ బి. నాగేంద్ర నాయక్ తెలిపారు.ప్రాజెక్టు పరిసరాల్లో పరిస్థితి సాధారణంగా ఉందని, నీటి ప్రవాహం సురక్షితంగా కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.