చందుర్తి: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం:వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.చందుర్తి మండల కేంద్రంలోనీ రైతు వేదికలో అర్హులైన 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారాక్,16 లక్షల 42 వేల విలువ గల 42 ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్,ఎరువులు,మేలైన వంగడాలను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని తెలిపారు.రైతులకు ఏక కాలంలో రైతు ప్రయోజనాలు కోసం 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.