రాయచోటి పట్టణంలోని మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాధమిక పాఠశాల (ఉర్దూ) మరియు వీరభద్రస్వామి గుడికి అడ్డంగా ఉన్న కూరగాయల మార్కెట్‌ను తొలగించాలని రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యుడు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.గుడి ఆవరణలో రైతులు, వ్యాపారులు వాహనాలు నిలిపివేయడం వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాఠశాల ముందు కూరగాయల అంగళ్ళు ఉండడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.మాసాపేటలోని రాయచోటి వ్యవసాయ మార్కెట్ యార్డుకు కూరగాయల వ్యాపారాన్ని మార్చితే రైతులు, విద్యార్థులు