పర్చూరు లోని అన్ని మండలాల వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ బాలాజీ..
వాలంటీర్ సేవలు గ్రామాల్లో అభివృద్ధికి ఆదర్శం.కరోనాలో అద్భుతంగా పనిచేశారు... వాలంటీర్ల సేవలను కొనియాడిన పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ బాలాజీ... వాలంటీర్ సేవలు ప్రతి గ్రామంలోనూ మరవరాని సేవలని,కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారని పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి యడం బాలాజీ అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాలంటీర్ల సేవలను చేశారని గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివిధ సేవలను అందించారని ఇలాంటి వాలంటీర్ సేవలను ప్రతి గడపగడపకు అందించిన మన సీఎం జగన్ మరొకసారి గెలిపించుకోవాలని నియోజకవర్గ ఇన్చార్జ్ బాలాజీ వాలంటీర్లను కోరారు.