డోన్: బేతంచెర్ల మండలం లో ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన వైకుంఠ సేవా సమితి సభ్యులు
Dhone, Nandyal | May 9, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లెలో ఉన్నం వెంకటేశ్వర్లు(32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక మరణించారు.మృతుడి భార్య, గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా వైకుంఠ సేవా సమితి సభ్యు లను కోరారు. సంస్థ సభ్యులు గూటుపల్లెలోని శ్మశాన వాటికలో వెంకటేశ్వర్లు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు లక్ష్మీరాఘవ, మహేశ్, సద్దాం పాల్గొన్నారు.