హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో కదిలే రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. రైలు పూర్తిగా ఆగకముందే దిగడంతో ఆ వ్యక్తి జారి ప్లాట్ ఫామ్ పై పడ్డాడు. రైలు కిందకు జారిపోతుండటాన్ని గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించారు. వేగంగా అతడి చేయి పట్టి వెనక్కు లాగడంతో ప్రమాదం తప్పింది. సీసీ కెమెరాలో రికార్డు కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా గా మారింది.