కొత్తగూడెం: PDSU జిల్లా మూడవ మహాసభ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో విద్యార్థులు భారీ ప్రదర్శన
రెండు రోజులపాటు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా 3వ మహాసభ సందర్భంగా మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఉర్దూఘర్ ఫంక్షన్ హాల్ వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు.. కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు అప్పారావు పాల్గొని మాట్లాడుతూ ఐదు దశాబ్దాలను పూర్తి చేసుకున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) ఉమ్మడి తెలుగు నేల పై చరిత్రలో నిలిచిపోయే విధంగా విద్యార్థుల పక్షాన నిలుస్తూ,రాజీలేని పోరాటాలను నిర్వహించిందని అన్నారు..