సంతనూతలపాడు: వైసిపి ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: మద్దిపాడు లో మాజీమంత్రి నేరుగ నాగార్జున
మద్దిపాడు: ప్రభుత్వం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన సంతనూతలపాడు లో నిర్వహించే ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. మద్దిపాడులో వైసిపి నాయకులు తో కలిసి ఆదివారం ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ దుర్మార్గమని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకునే వరకు వైసిపి ఉద్యమం కొనసాగుతుందన్నారు.