నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో వరి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన
Nandyal Urban, Nandyal | May 3, 2026
ఈ ఏడాది వరి రైతులు ధరలు లేక దిగాలు చెందుతున్నారు. కష్టపడి పండించిన దిగుబడులు ధరలు తగ్గడంతో ఇంటికి చేర్చుకోలేక, గోదాముల్లో నిల్వ చేసుకోలేక రోడ్లపై, మైదానాల్లో దిగుబడులు నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ దళారులు బస్తా రూ.1550 లోపే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర పెరగాలని కర్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.