ఆళ్లగడ్డ: నరసాపురం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసులు అనే యువకుడు అదృశ్యం
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసులు అనే యువకుడు అదృశ్యమయ్యాడు, ఆదివారం నుండి యువకుడు కనిపించడం లేదని అతడి తండ్రి గుర్రం పెద్ద రాముడు చుట్టుపక్కల వారిని బంధువులను విచారించిన ఆచూకీ తెలియకపోవడంతో రుద్రవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, తండ్రి గుర్రం పెద్ద రాముడు ఫిర్యాదు మేరకు ఎస్సై జయప్ప కేసు నమోదు చేశారు, గుర్రం శ్రీనివాసులు ఎవరికైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు