కర్నూలు: గంజాయి రవాణా ముఠా అరెస్ట్..20 కేజీల గంజాయి స్వాధీనం – కారు సీజ్ : కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్
గంజాయి రవాణా ముఠా అరెస్ట్ 20 కేజీల గంజాయి స్వాధీనం – కారు సీజ్ కర్నూలు, సెప్టెంబర్ 15: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు IV టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. సబ్ డివిజన్ డీఎస్పీ జె. బాబు ప్రసాద్ పర్యవేక్షణలో, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.కల్లూరు ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన టయోటా గ్లాంజా కారును (AP 40 N 3258) ఆపి పరిశీలించగా అందులో 20 కేజీల గంజాయి దొరికింది. కారు తలుపుల లోపల ప్రత్యేకంగా తయారు