కర్నూలు: దయనీయ స్థితిలో సామూహిక మరుగుదొడ్లుకు మరమ్మతులు నిర్వహించాలి: కర్నూలు సీపీఎం నేతలు డిమాండ్
కర్నూలులోని బండి మెట్టలో సామూహిక మరుగుదొడ్లు దయనీయ స్థితిలో ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఎం సీనియర్ నాయకులు డి.పార్వతయ్య, నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ఎండీ షరీఫ్ నగరపాలక సంస్థ కమిషనర్‌ను డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 12 గంటలు 3వ వార్డు బండి మెట్టలో పార్టీ ప్రతినిధి బృందం పర్యటించింది. ప్రజలు పారిశుధ్య లోపాలు, కాలువ సమస్యలు, టిట్కో, ఇందిరమ్మ ఇండ్లలో మౌలిక వసతుల కొరతలపై ఆవేదన వ్యక్తం చేశారు.