కరీంనగర్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం అందిన 44 అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కరించాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి పెండింగ్ దరఖాస్తులను స్వయంగా పరిశీలిస్తానని హెచ్చరించారు.