ఆళ్లగడ్డ: నంద్యాల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగి మూడు కార్లు ధ్వంసం
నంద్యాల జిల్లా నంద్యాల ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో భారీ వృక్షం కూలిపోవడంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి, సోమవారం రాత్రి ఈదురుగాలులు భారీ వర్షానికి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న పెద్ద వృక్షం ఒక్కసారిగా నేలకొరిగింది, వృక్షం కింద పార్కింగ్ చేసి ఉంచిన మూడు కార్లపై పడడంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి, కార్ల పై భాగాలు పూర్తిగా నుజ్జు నుజ్జు కావడంతో వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు