కావలి: శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేత
కావలి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు బొచ్చు వీరాస్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.