గుంటూరు: సంగడిగుంట ప్రాంతంలో ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
Guntur, Guntur | Sep 20, 2025 గుంటూరు 19 వ వార్డు సంగడిగుంట ప్రాంతంలో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పర్యటించారు. ఆ ప్రాంతం నుండి ఎక్కువగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడారు ఇటువంటి నీరు సరఫరా జరుగుతున్నాయి అడిగి తెలుసుకున్నారు. నీరు రంగు, వాసన మార్పు ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాలు అనే పద్యంలో మీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, కావున కొద్దిరోజులపాటు నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించారు.