శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుక వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.
శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోని రామమందిరంలో శ్రీసీతారాముల కల్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉదయం సీతారాములు, ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి, అనంతరం కల్యాణోత్సవం ప్రారంభించారు. ముందుగా లోకసంక్షేమం కోసం సంకల్పం చేసి, మహాగణపతి పూజ నిర్వహించారు.తర్వాత పుణ్యాహవచనం, కంకణపూజ, యజ్ఞోపవీతపూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, గౌరీపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలతో సంప్రదాయబద్ధంగా సీతారాముల కల్యాణం నిర్వహించారుఈ వేడుకలో అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.