గుంతకల్లు: గుత్తి మండలం ఈశ్వరపల్లి గ్రామానికి చెందిన లాలుస్వామి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఈశ్వరపల్లి గ్రామానికి చెందిన లాలు స్వామి అనే యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా మేరకు గ్రామానికి చెందిన లాలూస్వామి గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో పలు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లాలూ స్వామి పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.