మెహిదీపట్నం PVNR ఎక్స్‌ప్రెస్ వేపై పిల్లర్ నంబర్ 40 వద్ద కారు బోల్తా కొట్టడంతో రెండు వైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వస్తుండగా కారు అదుపు తప్పి వ్యతిరేక లేన్‌లో పడిపోయింది. వాహనంలో ఎంతమంది ఉన్నారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.