అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత గ్రామ దేవత శ్రీ మారెమ్మ దేవర కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. గ్రామ దేవత మారెమ్మ ఆలయం వద్ద దేవరలో భాగంగా బోనాలు, జంతుబలి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలో దేవర సందర్భంగా ఏర్పాటు చేసిన అంగల్లతోను తరలివచ్చిన జనంతో గ్రామం సందడి సందడిగా నెలకొంది.