చొప్పదండి: చాకుంటా గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండలం,చాకుంట గ్రామ సమీపంలో గురువారం 10 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది, కరీంనగర్కు చెందిన సమీర్ తన ద్విచక్ర వాహనంపై చొప్పదండి నుండి కరీంనగర్ వెళ్తుండగా,చొప్పదండి మండల కేంద్రానికి చెందిన నవీన్ తన స్నేహితుడు రవి ఒక ద్విచక్ర వాహనంపై కరీంనగర్ నుండి చొప్పదండి వెళ్తుండగా చాకుంట గ్రామ సమీప మధ్యకు రాగానే ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కున్నాయి,దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా నవీన్ పరిస్థితి విషమంగా ఉంది దీంతో స్థానికుల సహాయంతో హుటాహుటిన ముగ్గురిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,