ఎచ్చెర్ల: లావేరు మండలం బెజ్జపురం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ ఉరివేసుకొని ఆత్మహత్య
లావేరు మండలంలోని బెజ్జపురం గ్రామానికి చెందిన పొట్నురు క్రాంతి కిరణ్(39) బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టి నిత్యం వేధింపులకు గురి చేసిందని, వారితో కలిసి దాడి చేయించిందని వివరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసినట్లు పేర్కొన్నాడు.