కూనితోపు వద్ద హత్యకు గురైన యువకుడు జయప్రకాశ్ రెడ్డి గా గుర్తింపు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం కూనితోపు వద్ద శుక్రవారం ఉదయం ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు గురైన యువకుడు బి. కొత్తకోట మండలం. గుడిసే వారి పల్లె గ్రామానికి చెందిన జయప్రకాష్ రెడ్డి, 25 సంవత్సరాలు గా గుర్తించారు. హత్యకు గల కారణాలు పోలీసులవిచారణలో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.