ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో మహేంద్రను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు నిరసన
Ongole Urban, Prakasam | Jul 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మహేంద్ర అనే నాయి బ్రాహ్మణ వ్యక్తిని కత్తెరతో పొడిచి హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం గిద్దలూరు పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి నాయి బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. అలానే ప్రభుత్వం మహేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని వెంటనే హత్య చేయబడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సంఘం సభ్యులు కోరారు.