ఒంగోలు అర్బన్: వచ్చే ఏడాదిలోగా రెవిన్యూ సమస్యల రహిత జిల్లాగా ప్రకాశం జిల్లా: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 3, 2026
రెవెన్యూ సమస్యలపై వచ్చే ఆర్జీలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి నిర్ణీత గడువులోగా సహేతుకంగా పరిష్కరించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి లతో కలిసి కందుకూరు, అద్దంకి డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులతో సమావేశమై పిజిఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, మ్యుటేషన్లు, రెవెన్యూకు సంబంధించిన ఐవిఆర్ఎస్ కాల్స్, చరిత్ర అంశాల గురించి చర్చించారు