డోన్: బేతంచెర్ల మండలంలో రూ.58 కోట్లతో సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 14, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం రేపల్లె గ్రామంలో 58 కోట్ల సోలార్ విద్యుత్తు పథకాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా సోలార్ విద్యుత్తును అందిస్తున్నామని, అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పథకం నుంచి లబ్ధి పొందాలని సూచించారు.