ఆళ్లగడ్డ: అహోబిలంలో తలనీలాల తరలింపు పై ఉద్రిక్తత
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో తల నీలాల తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది, మాజీ సీఈఓ 122.1 కిలోల తలనీలాలను అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారని, స్థానికులు అడ్డుకున్నారు, సమాచారం అందుకున్న టిడిపి నాయకులు భూమా విఖ్యాత రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఎస్పీ, మటన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు, సీసీ కెమెరాలను నిర్వీర్యం చేసి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు, తల నీలాలను పోలీస్ కస్టడీలో ఉంచామన్నారు