బాల్కొండ: కమ్మర్‌పల్లిలో చేపలు పట్టేందుకు విద్యుత్ పెట్టిన యువకులు, అదే షాక్ వారికి తగిలి ఇద్దరు మృతి
కమ్మర్పల్లి మండల కేంద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన కొండపల్లి లక్ష్మణ్ (39), చిత్తారి నర్సింలు (30) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని కాల్వలో విద్యుత్ షాక్ ఏర్పాటు చేసి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుండగా, వారు ఉపయోగించిన కరెంటు వైర్ అనుకోకుండా 11 కెవి హై టెన్షన్ లైన్‌కు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. లక్ష్మణ్ భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.