రాప్తాడు: చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో సోమవారం 11 గంటల 45 నిమిషాల సమయం లో ఇంజనీరింగ్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలవేసి ఉపకులపతి సుదర్శన్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ నేటితరం ఇంజనీర్లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను ఆదర్శంగా తీసుకోవాలని అప్పుడే ఇంజనీరింగ్ విద్యార్థినిలు మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రుల ఆశయాలను ఇంజనీరింగ్ విద్యార్థినిలు నెరవేర్చాలని జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1500 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అంతా పాల్గొన్నారు.