ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో త్వరితగతిన పరిష్కరించండి:రెవెన్యూ అధికారి మధుసూదనరావు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సంతృప్తి స్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ..... ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. నాణ్యతతో కూడిన పరిష్కార మార్గం చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి